Site icon NTV Telugu

నకిలీ సర్టిఫికెట్‌లపై ఉన్నత విద్యామండలి నజర్‌..

నకిలీ సర్టిఫికెట్ లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు. వెబ్‌సైట్‌లో స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకురానుంది.

స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ద్వారా, నకిలీ సర్టిఫికెట్ దందా ను అరికట్టడం, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సమయాన్ని, ఖర్చు ను తగ్గించడం… ప్రధాన ఉద్దేశ్యం అని ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు.

Exit mobile version