ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు.
అయితే ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆధిక్యం వచ్చినా.. తిరిగి తొమ్మిదో రౌండ్ నుంచి ఈటల తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా పదో రౌండ్‌లో కూడా ఈటల 526 ఆధిక్యత సాధించారు. పదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల 5631 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.