తూర్పుగోదావరి జిల్లా కడియంలో రెండు తలలతో గేదెదూడ జన్మించింది. అనంతరం 1 గంటలోపే మరణించిన సంఘటన మండలంలోని మురమండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పాడిరైతు తూలూరి వీరకాసు మకాంలో నిన్న రాత్రి ముర్రా జాతి గేదెకు రెండు తలల లేగదూడ జన్మించింది. ఈ వార్త ఆ నోటా ఈ నోటా గ్రామమంతా వ్యాపించింది. గ్రామ ప్రజలు లేగదూడను చూసేందుకు ఎగబడ్డారు.
ఇంతలోనే ఆ దూడ మరణించడంతో నిరుత్సాహపడ్డారు. జన్యులోపంతో బహు అరుదుగా ఇలాంటి లేగదూడలు జన్మిస్తాయని వెటర్నరీ వైద్యులు చెప్పుతున్నారు. శరీరమంతా ఒకటిగా ఉండి, రెండు తలలు కలిగి ఉంటాయని, శరీరంలో అవయవాలు సంపూర్ణంగా తయారు కాకపోవడంతో మరణించడం జరుగుతుంది వైద్యులు వెల్లడించారు.