ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈవీ వాహనాలు రన్నింగ్‌లో వున్నప్పుడు వీడియో గేమ్స్,డ్యాష్ బోర్డ్ స్ర్కీన్స్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఇవి వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే కార్లు నడుస్తున్నప్పుడు వీటిని తాత్కాలికంగా ఆపేలా టెక్నాలజీ తీసుకువస్తోంది.
అమెరికాకి చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టే అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్ టీఎస్‌ఏ)తో జరిగిన ఒప్పందం ప్రకారం పాసింజర్ ప్లే గేమ్ వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనిని నిషేధించాలని నిర్ణయానికి వచ్చింది. కారు నడిచేటప్పుడు గేమ్స్, వీడియో గేమ్స్, డ్యాష్ బోర్డ్ గేమ్స్ తాత్కాలికంగా ఆగిపోతాయి. రోడ్లపై వేగంగా వెళ్లేటప్పుడు పాసింజర్లు వీడియో గేమ్స్ లాంటివి ఆడుతుంటే డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతింటుంది. అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్ల సేఫ్టీని దృష్టిలో వుంచుకుని ఈ తరహా నియంత్రణ అవసరం అని ఎన్‌హెచ్ టీఎస్‌ఏ భావిస్తోంది.
వాహనం ఆన్‌లో వున్నప్పుడు ప్రయాణికులు, డ్రైవర్లు ఈ తరహా గేమ్స్ ఆడడం కుదరకుండా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ తరహా నియంత్రణకు అవకాశం వుండాలని భావిస్తున్నామని టెస్లా తెలిపింది. 2017 నుంచి ఇప్పటివరకూ అమ్ముడయిన సుమారు 5 మిలియన్ల టెస్లా కార్లపై అమెరికన్ ప్రభుత్వం నివేదిక కోరింది. ఈఏడాది ఆగస్టులో ఎన్‌హెచ్ టీఎస్‌ఏ కి ఒక ఫిర్యాదు అందింది. వెబ్ సెర్చింగ్, లైవ్ గేమ్స్ కార్లలో వున్నవారు ఆడుతున్నారని, ఇది సేఫ్టీ పరంగా మంచిదికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కారు నడుస్తున్నప్పుడు వీడియో గేమ్స్ ఆడడానికి అవకాశం లేకుండా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయనున్నారు.