తెలంగాణలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంపై దుమారం రేగుతోంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు తేలడంతో టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో కూడా లీక్ అయ్యిందా లనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
Also read: Tourist Attraction: ఆస్కార్ గెలిచిన ‘ఎలిఫెంట్’.. ఏనుగును చూసేందుకు జనం క్యూ
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ ముట్టడికి పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నేతలు తరలివచ్చారు. దీనిపై బీజేవైఎం, కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పేపర్ లీకులకు ప్రాధాన కారణమైన నిందుతుడు ప్రవీణ్, ఇతరులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పరిస్థితిలో పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పేపర్ లీకేజీ వ్యవహారంతో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పరీక్ష పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.