Site icon NTV Telugu

అయ్య బాబోయ్… ప్రతిరోజూ రూ.కోటిన్నర జరిమానాలు

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జరిమానాల రూపంలో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఏడాదిలో ఇప్పటిరకు రూ.533కోట్ల జరిమనాను పోలీసులు విధించారు. అంటే రోజుకు రూ. కోటిన్నర చొప్పున వసూలు చేశారు.

Read Also: అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి…

అయితే ట్రాఫిక్ ఛలానాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించనందుకు విధించిన జరిమానాలే ఉన్నాయి. హెల్మెట్‌లు ధరించని ఉల్లంఘనలు సుమారు 1.10 లక్షలు నమోదయ్యాయి. మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల్లో హెల్మెట్ కేసులే 37.33 శాతం ఉన్నాయి. బైక్ రైడర్ మాత్రమే కాదు పిలియన్ రైడర్ (వెనుక కూర్చున్న వ్యక్తి) హెల్మెట్ ధరించకపోయినా పోలీసులు ఛలానాలు విధిస్తున్నారు. మరోవైపు ఓవర్‌స్పీడ్‌కు సంబంధించిన జరిమానాలు 27.2 శాతం, ట్రిపుల్ రైడింగ్ జరిమానాలు 10.2 శాతం ఉన్నాయి. మొత్తం వసూళ్లలో ఈ మూడింటివే 74.4 శాతంగా నమోదయ్యాయి. అంటే కార్ల కన్నా.. బైక్‌లకే ఎక్కువ జరిమానాలు పడినట్లు స్పష్టమవుతోంది.

Exit mobile version