తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలను కూడా హరీష్‌రావుకు అప్పగించనున్నారు.. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయానికి రాగా.. కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.. కాగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడంతో.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కేసీఆర్ దగ్గరే ఉంచుకున్నారు.. కరోనా సమయంలో.. సమీక్షలు నిర్వహిస్తూ.. ఆస్పత్రులకు వెళ్లి కరోనా వార్డులను కూడా సందర్శించారు. ఇక, ఇప్పుడు హరీష్‌రావుకు వైద్యారోగ్యశాఖ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..
హరీష్‌రావు చేతికి ఆరోగ్యశాఖ..
