రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విధుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూడాలు, రెసిడెంట్ వైద్యులు రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా, విధులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. పెంచిన స్టైపండ్, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మా సమ్మెపై స్పందించకుంటే 27 నుంచి అన్ని విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కొవిడ్‌తో మృతిచెందిన వైద్యులకు రూ.50 లక్షలు, ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని సమ్మె నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ నెల 10న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించిన విషయం తెలిసిందే.
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.