Site icon NTV Telugu

‘నయీం డైరీస్’ మూవీకి హైకోర్టు షాక్.. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు

తెలంగాణ గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్

అయితే సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు తమకు రెండు రోజుల సమయం కావాలని నయీం డైరీస్ సినిమా దర్శకుడు తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సాధ్యమైనంత త్వరగా ఆ దృశ్యాలను తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా నయీం డైరీస్ మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ మూవీ విడుదలైన సంధ్య థియేటర్ వద్ద బెల్లి లలిత కుటుంబసభ్యులు, తెలంగాణ వాదులు ఆందోళనకు దిగడంతో ప్రదర్శన నిలిచిపోయింది. అనంతరం ఈ సినిమాపై ఆందోళనకారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా నయీం డైరీస్ మూవీలో వశిష్ట సింహ, నిఖిల్ దేవాదుల, యగ్న శెట్టి, సంయుక్త, శశికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version