Site icon NTV Telugu

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ స‌రికొత్త రికార్డు

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ స‌ర్కార్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లు గత ఏడాది వానాకాలం రికార్డును దాటాయ‌ని… పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామ‌ని.. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనే ఛాన్స్ ఉన్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు.

గత ఏడాది 48.75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ జ‌రిగిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 14 జిల్లాల్లో 1,810 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి అయిన‌ట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆకాల వర్షాలు ఇబ్బందుపాలు చేసినా.. కొనుగోళ్లలో వేగం పెంచామ‌న్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ విజయాలను చూసైనా కేంద్రం తన నిర్ణయాన్ని పున:సంమీక్షించుకోవాలని తెలిపారు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

Exit mobile version