NTV Telugu Site icon

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం: ప్ర‌భుత్వం ప‌రిధిలోకి మాంసం దుకాణాలు…

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ది.  రాష్ట్రంలో మాంసం ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు, అంద‌రికీ ప‌రిశుభ్ర‌మైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర ప‌శువ‌ర్థ‌క శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ది.  రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాల‌ను ప్ర‌భుత్వం ప‌రిధిలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ది ప‌శువ‌ర్ధ‌క శాఖ‌.  రాష్ట్రంలో క‌బేళాల‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ది. రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాలో ఒక‌టి లేదా రెండు చొప్పున‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో ప్ర‌తి జోన్‌లో ఒక‌టి చొప్పున వ‌ధ‌శాల‌ల‌ను ఏర్పాటు చేసివాటిని స్థానిక మాంసం దుకాణాల‌తో లింక్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ది.  ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేసే మాంసాన్ని మాత్ర‌మే ఇక‌పై మాంసం దుకాణాల్లో అమ్మాల్సి ఉంటుంది.  ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కు మాత్ర‌మే విక్ర‌యించాల్సి ఉంటుంది.  ఫ‌లితంగా ధ‌ర‌ల‌ను నియంత్రించ‌వ‌చ్చు అన్న‌ది ప్ర‌భుత్వం ఉద్దేశం.  

Read: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న డెల్టా… 90శాతం ఆ వేరియంట్ కేసులే…