NTV Telugu Site icon

సెప్టెంబ‌ర్ 10 నాటికి 100 శాతం వ్యాక్సినేష‌న్‌…

దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లుచేస్తున్నారు.  ప్ర‌తిరోజూ కోటి మంది వ‌ర‌కు టీకాలు తీసుకుంటున్నారు.  ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టికే విద్యాసంస్థ‌లను ఒపెన్ చేశారు.  అర్హులైన ప్ర‌తి విద్యార్ధి, ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ టీకాలు తీసుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశించింది.  ప్ర‌ధానోపాద్యాయులు, పీహెచ్‌సీలు స‌మ‌న్వ‌యంతో టీకాలు వేయాల‌ని, ఈ విష‌యంలో క‌లెక్ట‌ర్లు చొర‌వ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది.  సెప్టెంబ‌ర్ 10 వ తేదీలోగా విద్యాసంస్థ‌ల్లో 100శాతం వ్యాక్సినేష‌న్ పూర్తికావాల‌ని ఆదేశించింది.  100శాతం వ్యాక్సినేష‌న్ పూర్తైతే ప్ర‌త్యేక బ్యాన‌ర్లు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  

Read: జోరు వాన‌లో వాహ‌నాల‌ను స్పీడుగా న‌డుపుతున్నారా… జ‌రా భ‌ద్రం…