మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కోవిడ్ విరుచుకుపడడంతో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన వారెందరో. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనుంది.
సిగ్నళ్ల వద్ద అనాథలతో భిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కార్ నిలవనుంది. అనాథలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించనుంది. ప్రత్యేక గురుకులాలతో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటుచేయనుంది. కరోనా వల్ల తమకు ఎవరూ లేరనే భావన లేకుండా భరోసా కల్పించాలంది. ఉపాధి, కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వ సంరక్షణ వుంటుంది. రాష్ట్ర బిడ్డలుగా గుర్తిస్తూ ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వనుంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు వచ్చాయి.
