NTV Telugu Site icon

తెలంగాణ క‌రోనా అప్డేట్‌: కొత్త‌గా కేసులు ఎన్నంటే…

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  రాష్ట్రంలో కొత్త‌గా 313 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,58,689కి చేరింది.  ఇందులో 6,49,002 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,809 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో క‌రోనాతో ఇద్దరు మృతిచెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన‌వారి సంఖ్య 3,878 కి చేరింది.  ఇక తెలంగాణ‌లో వేగంగా వ్యాక్సినేష‌న్‌ను అమ‌లు చేయ‌డ‌మే కాకుండా నిబంధ‌న‌లు పాటిస్తుండ‌టంతో కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. 

Read: ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…