Site icon NTV Telugu

తెలంగాణ కొత్తగా కరోనా కేసులెన్నంటే..?

కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో కరోనా కేసులు అనుహ్యంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూతో పాటు వీకెండ్‌ లాక్‌డౌన్‌ లాంటివి విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి.

అయితే తెలంగాణలో సైతం కరోనా కోరలు చాస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనా సోకి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో మరో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 22,472 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.29 శాతం ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,206 కరోనా కేసులు నమోదయ్యాయి.

Exit mobile version