తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రల బాట పడుతోంది. పెరిగిన ధరలే అస్త్రాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్తోంది. మరోవైపు…భూ సంస్కరణలపై ఒక రోజు పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు రాహుల్ గాంధీ. నిత్యవసర ధరల పెరుగుదలపై ఏఐసీసీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాద యాత్రలు చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో… తెలంగాణ పిసిసి ఆందోళన బాట పట్టింది. పిసిసి చీఫ్ రేవంత్ చేవెళ్ల నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు దిగ్విజయ్ సింగ్ ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
2022 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ ఒక్కరోజుపాటు తెలంగాణలో పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.భూ సంస్కరణల పై… జనవరి 30 నుంచి 15 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర ఉండనుంది.ఏఐసీసీ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ 15 రోజుల పాదయాత్ర చేస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణకి రానున్నారు. త్వరలో మరిన్ని నిరసన యాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్. నాయకులు నియోజకవర్గాల వారీగా సమస్యలపై ఆందోళనలు నిర్వహించనున్నారు.
చేవెళ్ల నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర !
