4 నియోజకవర్గాల్లో దళిత బంధు.. 13న సీఎం కేసీఆర్ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పటికే తాను దత్తత తీసుకున్న వాసాలమర్రిలో అమలు చేశారు.. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.. ఇక, మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అంటే.. నాలుగో నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు..
మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజక వర్గంలోని నిజాంసాగర్ మండలం ఇలా నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు.. ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ‘ దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు.. సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో… ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్.. నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు., జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు,. మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సిఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని తెలిపారు సీఎం కేసీఆర్.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..