Site icon NTV Telugu

ప్రారంభమైన తెలంగాణ కేబినేట్‌ భేటీ..వీటిపైనే చర్చ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినేట్‌ సమావేశం.. ప్రగతి భవన్‌ లో జరుగుతోంది. అయితే.. ఈ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వరి ధాన్యం కొనుగోలు పై ముఖ్యంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది.

అలాగే…. యాసంగి లో వరి సాగు, కొత్త వరైటీ , ప్రత్యామ్నాయ పంటల పై కూడా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం, అరికట్టే చర్యలు, కరోనా వ్యాక్సినేషన్‌ వేగవంతం లాంటి పలు అంశాలపై కేసీఆర్‌ కేబినెట్‌ చర్చించే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేబినెట్ తరువాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వరి ధాన్యం అంశంపై మాట్లాడే చాన్స్‌ ఉంది.

Exit mobile version