NTV Telugu Site icon

Telangana : విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్ టైమింగ్స్ మారాయి..!

Telangana School Timings

Telangana School Timings

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. తెలంగాణాలో పరిస్థితి వర్ణనాతీతం.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, నాళాలు కలిసిపోయాయి.. ప్రజలు బయట కాలు పెట్టలేని పరిస్థితి.. తెలంగాణలో గత వారంలో భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారం, శనివారం స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు.. ఇప్పుడు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.. దీంతో స్కూల్స్ ఉన్నాయా? లేదా? అనే సంధిగ్ధం లో విద్యార్థులు, తల్లి దండ్రులు ఉన్నారు..

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. రాష్ట్రంలోని సూళ్ల టైమింగ్స్‌లో మార్పులు చేసింది. ఇక నుంచి స్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రైమరీ స్కూళ్లు, 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు అప్పర్ ప్రైమరీ స్కూళ్లు పనిచేయనున్నాయి. అయితే.. ఈ మార్పులు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో ఉన్న పాఠశాలలు కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లకు వర్తించనున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది..

పనివేళల్లో మార్పులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ పంపించింది. వారి పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.. ప్రైమరీ వాళ్ళకు ఆరోగ్య రీత్యా స్కూల్ టైమింగ్స్ కు మార్చినట్లు తెలుస్తుంది.. వారికి తప్పనిసరిగా ఉదయం 9.30 నుంచి 4.45 నిమిషాల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.. మంగళవారం నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు.. మరోవైపు భారీ వర్షాలు రాష్ట్రాన్ని వదలడం లేదు.. మరో మూడు రోజులు భారీ, నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూసిస్తున్నారు..