Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telakapalli Ravi Analysis On Covid 19 In India

తెలకపల్లి రవి:  శవగంగాప్రవాహం-శివమెత్తిన దేశం

Published Date :May 20, 2021 , 10:28 am
By NTV WebDesk
తెలకపల్లి రవి:  శవగంగాప్రవాహం-శివమెత్తిన దేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్వరరాగ గంగా ప్రవాహమే అని జేసుదాసు పాడితే   పరవశించిపోయిన ఈ దేశంలో  ఇప్పుడు శవగంగా ప్రవాహం చూశావా రాజా అని ప్రశ్నించే విషాదాన్ని సృష్టించిన వారెవరు? పరవశాన శిరసూగంగా తలకు జారెనా శివగంగ అని శంకరశాస్త్రి గానం చేసిన శివగంగను శవగంగగా మార్చిన వారెవరు?   సెకండ్‌ వేవ్‌ అనే కరోనా మలిదెబ్బకు  కుటుంబాలకు కుటుంబాలే బలైపోతుంటే  ప్రాణవాయువును అందించలేని ఘోర దురవస్థ రావడానికి కారకులెవరు?ప్రపంచానికే వాక్సిన్‌ అందించే ఔషద రాజధానిగా దేశాన్ని మార్చామని గొప్పు పోయిన చోట వాక్సిన్‌ కేంద్రాల మూత ఎందుకు జరుగుతున్నది? ప్రభుత్వాసుపత్రలు చాలక,ప్రయివేటు వైద్యం ఖరీదు అందక,మందుచిక్కక వేలమందిప్రాణాలు వదిలే పరిణామం ఎందుకొచ్చింది?
రాజా,వినిపిస్తుందా గుజరాతీ కవయిత్రి పరుల్‌ కుకర్‌ అక్షరాలా సంఘపరివార్‌ భాగస్వామి. ఆమెను కవయిత్రిగా  వారే ప్రచారంలో పెట్టారు. రాధాకృష్ణ శృంగారాన్ని భక్తిని గానం చేసిన భక్తురాలు. మోడీకి బిజెపికి కూడా భక్తురాలే. కాని భయానకంగా మారిన కోవిడ్‌ విషాదం చూడలేక  చలించిపోయింది. రాజా,శవాలు మాట్లాడుతున్నాయి వినిపిస్తుందా అని  కవిత రాసింది. అంతా శ్మశానమై పోయింది.. ఓ రాజా బతికించే వాళ్లు లేరు,శవాలను మోసే వాళ్లు లేరు, అంతా కోల్పోయిన దు:ఖితు మాత్రం మిగిలారు/మాటు లేక బరువెక్కిన మా హృదయాలు శోకగీతాలైనాయి/ప్రతిఇంట్లో మృత్యుదేవత తాండవమాడుతోంది/ఓ రాజా నీ రామరాజ్యంలో గంగశవమయమై శవగంగా ప్రవాహమైంది/ఆచ్చాదన లేని దిగంబర రాజును అంతా చూస్తున్నారు/ కోపాన జ్వాలు ఆకాశాన్నితాకుతున్నాయి….పరుల్‌ కుక్కర్‌ కవితలో ప్రజ్వరిల్లిన ఈ ఆగ్రహావేదను వాస్తవానికి భారతదేశంలో వికటాట్టహాసం చేస్తున్న మృత్యునృత్య ప్రతిబింబాలే.ఏలినవారికి అందులోనూ దేశమేలే రాజుగారికి ఇవి బొత్తిగా మింగుడు పడటం లేదు. వారికి వందిమాగధ కీర్తనలు తప్ప వాస్తవ వేదనలు బొత్తిగా గిట్టవు. అందుకే ఆయన కనుసైగతో సంఘ పరివార్‌ ఆమెపై దాడి చేసింది. నిన్న సంప్రదాయ మూర్తిగా గోచరించిన ఆ మహిళే ఈ రోజు  మహమ్మారి అయినట్టు ప్రాణమానాలు హరిస్తామని బెదిరింపులకు దిగారు. వెకిలి మాటలతో వేటకొడవళ్లతో వెంటాడటం మొదలుపెట్టారు.
                         నూటముప్పై కోట్ల బకరాల 
           జగ్‌సూర్య ప్రముఖ వ్యంగ్యరచయిత. సీనియర్‌ కాలమిస్టు.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఆయన పదునైన వ్యంగ్య బాణాలు ప్రసిద్ధం. మహాప్రభువు, మహా వంత(సుప్రీంలీడర్‌,సూపర్‌ సైడ్‌కిక్‌) కలసి మాట్లాడుకున్నట్టు ఆయన ఒక  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.నిన్నటి దాకా మనను పొగిడిన వారే ఇప్పుడు తిట్టిపోస్తున్నారేమిటనిమహా ప్రభువు ప్రశ్నిస్తాడు. మనం భజనను తప్ప విమర్శ పట్టించుకోము గదా అని మహావంత సర్దుబాటు చేయబోతాడు. కాదు వంతా ఈసారి అలా కుదిరేట్టులేదనివాపోతాడు మహాప్రభువు.చివరకు దీనంతటినీ మోపడానికి ఎవరో ఒక బలిపశువును(స్పేప్‌గోట్‌)నుచూద్దామని మహావంత అంటే బలిపశువు కాదు, తప్పించేవారు(ఎస్పేప్‌గోట్‌) కావాంటాడు. దాందేముంది?ఇప్పటికే ఈ దేశంలో నూట ముప్పై కోట్ల ప్రజలను బకరాలను చేశాముకదా అంటాడు వంత.ఈవ్యంగ్యరచన టైమ్స్‌ వెబ్‌ ఎడిషన్‌లో వచ్చింది గాని పత్రిక అచ్చయి వచ్చేసరికి లేదు. దాన్ని తీసేయించారు.వైర్‌ పత్రిక ఆ పాఠాన్ని ప్రచురించింది గనక మనకు దొరికింది.
                                   అస్మదీయులోనే అలజడి
అయితే ఈ అవకాశం కూడా బిజెపికి వుండకుండా పోతున్నది. ఆ పార్టీ నేతలే మోడీ విధానాల వైఫల్యాన్ని తూర్పార పడుతున్నారు. బిజెపికి అత్యధిక స్థానాలున్న యుపిలో ఇప్పటికి మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు ,ఇద్దరు మంత్రులు మరణించారు. బుధవారం కూడా  రెవెన్యూ మంత్రి విజయ్‌ కశ్యప్‌ కరోనాతో చనిపోయారు. పశ్చిమ లక్నో ఎంఎల్‌ఎ సురేష్‌ శ్రీవాత్సవ,రాయ్‌ బరేలి  ఎంఎల్‌ఎ దల్‌బహుదూర్‌ కోరి,అరూలియా ఎంఎల్‌ఎ రమేష్‌ దినకర్‌,బరైలీ ఎంఎల్‌ఎ కేర్‌సింగ్‌ ఇలా వరుసపెట్టి కోవిడ్‌కు బలైపోయారు.  తనే పాజిటివ్‌కు గురైన ఫిరోజాబాద్‌ ఎంఎల్‌ఎ పప్పులోధి భార్యను చేర్పించాంటే  ఆస్పత్రి దొరక్క  మూడు గంటలు  నిరీక్షించాల్సి వచ్చిందట.వీరంతా ఎందుకు? కేంద్ర మంత్రి సంతోష్‌గ్యాంగ్‌వర్‌ తన నియోజకవర్గమైన బరైలీలో కోవిడ్‌ సదుపాయాలే లేవని ముఖ్యమంత్రి యోగికి లేఖ రాయాల్సి వచ్చింది.రాష్ట్ర మంత్రులు కూడా ఇలాగే మొరపెట్టుకున్నారు.బీహార్‌లో బిజెపి ఐటిసెల్‌ కన్వీనర్‌ అనుష్‌ఠాగూర్‌ వాక్సిన్‌ కొరతపై తానే ఫేస్‌ బుక్ లో పోస్ట్  పెట్టాల్సివచ్చింది.ఇంత ధైర్యంలేని బిజెపి ఖైరాబాద్‌ ఎంఎల్‌ఎ రాకేశ్‌రాథోర్‌ మీ నియోజకవర్గంలో  కోవిడ్‌ ఆస్పత్రి ఏమైంది అని మీడియా అడిగితే ఇప్పుడు మాట్లాడితే రాజద్రోహమవుంతుందని చేతులెత్తేయడం దేశంలో పరిస్థితికి అద్దం పడుతుంది.వీరంతాఏమిటి?సాక్షాత్తూ బిజెపి గ్రేట్‌ లిటిగెంట్‌ సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈ దారుణ పరిస్థితికి తట్టుకోలేక ప్రభుత్వంపై విరుచుకుపడాల్చి వచ్చింది. కోవిడ్‌ కేసు కాస్త తగ్గగానే మాదే ఘనతన్నారుకదా ఇప్పుడు ఇంతగా విజృంభిస్తే మీ బాధ్యతవుండదా?అని ట్విటర్‌లో ప్రశ్నించారు.
                                  నిజంగానే అన్‌లిమిటెడ్‌
   ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్‌ అధినేతలు  రంగప్రవేశంచేసి  మోడీ ఇమేజి డామేజిని సరిచేయడానికి పాజిటివిటీ అన్‌లిమిటెడ్‌ పేరిట కప్పిపూతప్రహసనం ఒకటి ప్రారంభించారు. అజిత్‌ ప్రేమ్‌జీ,శ్రీశ్రీరవిశంకర్‌,సద్దురుజగ్గీవాసుదేవ్‌ వంటివారిని పిలిపించి నాలుగు మంచి మాటలు చెప్పించి మోడీని కాపాడేందుకు రంగప్రవేశం చేశారు.ే ఆ సభలోనూ స్వయంగా మోహన్‌ భగవత్‌ ప్రజా ప్రభుత్వమూ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇంతటి దుస్తితి ఎదురైందని చెప్పక తప్పలేదు.మరోవైపున ఎంజె అక్బర్‌,అనురాగ్‌ఠాగూర్‌ తదితయి సోషల్‌మీడియాలో మోడీపై కట్టుతెంచుకుంటున్న ఆగ్రహాన్ని ఎలా అదుపు చేయాలని అల్లాడిపోతున్నారు.ఎన్ని తంటాలు పడితేనేం? మోడీ తప్పుకో అనే హ్యాష్‌ట్యాగ్‌కు కోట్లాది లైక్ లు! ప్రత్యక్షాదేశాలతోనో పరోక్ష ఒత్తిడితోనో దాన్ని తొగించిన ఫేస్‌బుక్‌ యాజమాన్యం తర్వాత ా పునరుద్ధరించకతప్పనిస్థితి. కోవిడ్‌లోనూ మత విభేదాలు  ప్రచారంలోపెడుతున్న ఆరెస్సెస్‌ తీరుపై విమర్శనాత్మక పోస్టునుతొగించేందుకు ్‌ నిరాకరించవసిన స్థితి. గతసారి నిజాముద్దిన్‌ మర్కజ్‌ తబ్లిగే జమాయిత్‌ వల్లనే  కోవిడ్‌ వ్యాపించందన్నట్టు ప్రచారంచేసిన పరివారం  కుంభమేళాలో ఆదిగురువులే అసహాయంగా రాలిపోతుంటే  సమర్థించుకోలేక ఆఖరి ఘట్టంలో ఏదో కంటితుడుపు  చర్యలతో  సరిపెట్టే యత్నాలు విఫలం.అటు కుంభమేళాతోనూ ఇటు బెంగాల్‌ ఎనిమిది దశ ఎన్నికల సభలతోనూ స్వయంగా మోడీ.అమిత్‌షాలే కరోనా వ్యాప్తికి కారకులైనారనే కఠోరసత్యం కళ్లముందు నిలిచిన చిత్రం.
                           మహామానవా బహుపరాక్‌
            అన్నీ స్పష్టంగా  కనిపిస్తున్నా ఇంకా ప్రధానిమహామానవుడు గనకే ఆయన దేశప్రజందరిబాధ తనదిగా చేసుకున్నాడని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసు. ఆక్సీజన్‌నుంచి వాక్సిన్‌ వరకూ ప్రతిదీ అందించారని బిజెపిఅద్యక్షుడు  జెపినడ్డాపొగడ్తు.మోడీ మార్గనిర్దేశంలో దేశం స్థయిర్యవంతమైందని విదేశాంగమంత్రి జైశంకర్‌ కీర్తనలు .క్లిష్టసమయంలో దేశాన్ని ఒక్కతాటిపై నిలిపారని రవిశంకర్‌ ప్రసాద్‌ భజనలు. ఇవన్నీ  నెల కిందటి సంగతులే సుమా! మొత్తం నేనేనన్న మోడీజీ కోవిడ్‌ విధానం ఘోరంగా విపలమైంది. రోజుకు నాలుగులక్షలు దాటినపాజిటిమ్‌ నాలుగు వేలకు పైన చావులు..  ప్రపంచంలోనే ఘోరమైన దేశంగా చేశాయి.వాక్సిన్‌ వచ్చేసిందని వరుసులు నిలబెట్టి చేతులెత్తేసిన బాధ్యతా దేశప్రజలను కుపితులను చేసింది. వరుసగా రాష్ట్రాల ముఖ్యమంత్రు వాక్సిన్‌ ఆక్సీజన్‌ కోసం కేంద్రానికి లేఖలు కురిపించాల్సి వచ్చింది.  పార్టీలు మీడియా వైద్య బృందాల సంగతి అటుంచి  సుప్రీం కోర్టు,హైకోర్టు తాముగా జోక్యం చేసుకోవలసి వచ్చింది.  ఈ దేశాన్ని దేవుడే కాపాడాని యుపి హైకోర్టు వంటివి వ్యాఖ్యానించాయి.కోవిడ్‌ను ి అద్యయనం చేయడానికి ఏర్పాటైన జీనోమ్‌ కన్సార్టియం(ఇన్సాకోగ్‌) అధినేత ప్రముఖవైరాజిస్టు షాహిద్‌ జమీల్‌ ప్రభుత్వం  ఎలాంటి  సలహాలు వినిపించుకోవడం లేదంటూ రాజీనామా చేశారు. కోవిడ్‌ 19  బెడద బ్లాక్‌ పంగస్‌ ముప్పుగా మారి దేశ ప్రజలు చూపు కోల్పోతున్నా ఇప్పటికీ కళ్లు తెరవని కేంద్ర సర్కారు సంప్రదింపు సమీక్షలు అంటూ సరిపెడుతున్నారు.
                           చెప్పడం కాదు, వినండి!
  ఎన్ని మాటుచెప్పినా   బ్రాండ్‌ మోడీ  దెబ్బ తిని,ఎన్నికల్లో ఎక్కడ ఆవకాశమున్నా ఓడించి పంపుతున్నారు. మన్‌కీబాత్‌ు వినడంమానేసి  గుజరాతీ కవయిత్రి పరుల్‌ కక్కుల్‌లా  శవాల మాటులు వినిపిస్తున్నాయా,శవగంగ కనిపిస్తున్నదా అని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రుల నుంచి శ్మశానాల దాకా ప్రతిచోటా ఆసేతుశీతాచలం   అదే సవాలు … రాజా వినిపిస్తున్నదా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Analysis
  • corona Cases
  • Corona deaths
  • Covid 19

తాజావార్తలు

  • PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏంది సామి నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions