Site icon NTV Telugu

తెలకపల్లి రవి : బిజెపి ఇమేజికి కాయకల్ప చికిత్సలు

ఒకవైపున మలివిడత కరోనా మరణాల తాకిడి తగ్గిందని వార్తలు మరోవైపు మూడో విడతపై భయసందేహాల మధ్య కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరస్థితులు ప్రజల జీవనగతులు తలకిందులైనాయి. ధరల పెరుగుదలకు తోడు ప్రభుత్వాల ఉపేక్ష ప్రజల పాలిట పెనుశాపంగా మారింది. మరోవైపున ఈ దెబ్బతో రాజకీయ వ్యవస్థ కూడా కల్లోలితమవుతున్నది. నిరంతర ప్రవచనాలతో ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాదరణ తగ్గినట్టు ఎప్పటికప్పుడు సర్వేలు ఎన్నికలు కూడా విదితం చేస్తున్నాయి. నష్టనివారణ చర్యలతో ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆయనతో పాటు ఆడిరచే ఆరెస్సెస్‌ కూడా నానాపాట్లు పడుతున్నది. మూలవిరాట్టుతోనే మొదలుపెడితే బ్రాండ్‌ మోడీ బ్యాడ్‌ ప్రభతగ్గినట్టుచాలా సార్లు రుజువైంది.ఆయన ఆమోదయోగ్యత పడిపోయినట్టు కూడా సర్వే సంస్థలు వెల్లడిరచాయి. దాన్నిఏమీచేయలేక అటునుంచి నరుక్కువచ్చే ఎత్తుగడచేపట్టారు. తగ్గిపోయిన తన ఆదరణతోపోల్చి చెప్పే బదులు ఇప్పుడు ఇతర దేశాల నాయకులతో పోల్చి ఆయనకే ఎక్కువ రేటింగ్‌ అని వూదరగొట్టడం మొదలెట్టారు.

ఈ కారణంగానే మోడీ రెండేళ్లుగా వాయిదా వేస్తున్న కేంద్ర మంత్రి వర్గవిస్తరణ చేసి కొత్తమొహాలను చేర్చుకోవడంతోనైనా ఇమేజి కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఎవరినితీసుకోవాలో ఎవరిని వదిలించుకుంటే ఏమవుతుందో తేల్చుకోలేక ఎడతెగని మంతనాలు జరుపుతున్నారు. గతంలో గొప్పగా చెప్పిన చాలా పేర్లు ఇప్పుడు అసలు వినిపించడం లేదు.అకాలీదళ్‌ నిష్క్రమణతో పంజాబ్‌లో వంటరిపాటు మిగిలింది,చిరాగ్‌పాశ్వాన్‌ లోక్‌జనశక్తిపార్టీలోనూ తిరుగుబాటు పేరుతో చీలిక తీసుకొచ్చారు. బీహార్‌ ఎన్నికల్లో వంటరిగా పోటీ చేసినా తమకు నితిశ్‌ కుమార్‌పై తప్పమోడిపై వ్యతిరేకత లేదని, తాను ఆయనకు హనుమాన్‌ వంటివాడినని చిరాగ్‌ ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది.జెడియు హస్తం ప్రధానమైనా బిజెపి ఆశీస్సులు కూడా ఈ పరిణామం వెనక వున్నాయని స్పష్టమైంది.మిత్రపార్టీలుగా వున్నవాటిని చీల్చడంతో బిజెపిపై వాటి విశ్వాసం మరింత సన్నగిల్లే పరిస్తితి. బిజెపి పాలించే అతి పెద్ద రాష్ట్రమైన యుపి 2022లో ఎన్నికలకు వెళ్లవలసి వుండగా యోగి ప్రభుత్వం పరిస్తితి చుక్కెదురుగా వుంది.కరోనా వైఫల్యం,మతతత్వవివాదాలు, దళితులపై దాడులు,స్థానిక ఎన్నికల్లో ఓటమి వంటివి వెంటాడుతున్నాయి.

అయోధ్యరామమందిరం కోసం స్థలం కొనుగోలులోనూ 18 కోట్ల అవినీతి కుంభకోణం పరువుతీసింది.బిజెపి అంతర్గత కలహాలు ఇందుకు తోడై పాలన స్తంభించిపోయింది. మోడీశిష్యుడైన అరవింద్‌కుమార్‌ శర్మను మొదట ఎంఎల్‌సిగా పంపించి ఇప్పుడుమంత్రివర్గంలో తీసుకోమని వత్తిడిపెడితే అది తనపై నిఘాగా భావించిన యోగి వ్యతిరేకించారు. ఆరెస్సెస్‌ బిజెపి కేంద్ర నాయకులను పరిశీలకులుగా పంపించి ఆయనను దారికి తెచ్చారు. ఢల్లీిలో మోడీ షాలతో చర్చలు జరిపిన యోగి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు ఒప్పుకున్నట్టుచెబుతున్నారు. దక్షిణాదిలో బిజెపికి వున్న ఒకే రాష్ట్రంకర్ణాటక లో యెడ్యూరప్ప పరిస్థితీ అంతే అయింది, కరోనా ఒకవైపు మతవివాదాలు మరోవైపు సాగుతుందగా యెడ్యూరప్పపై బిజెపిలోనే తిరుగుబాటు బయిలుదేరింది.ఆయనను మారుస్తారనీ మార్చరని భిన్న కథనాలు చెలరేగాయి. మార్చే ధైర్యం చేయలేని బిజెపి అధిష్టానం చివరకు రాష్ట్ర బాధ్యుడైన అరుణ్‌సింగ్‌ ద్వారా ఆయనే కొనసాగుతారని చెప్పించింది.అయితే బాహాటంగా అసమ్మతి కొనసాగుతున్నందున అక్కడ ప్రశాంతత నెలకొనే అవకాశమే లేదు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ముందు ఉధృతంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ వారిని చేర్చుకుని టికెట్టు ఇవ్వగాఇప్పుడు రివర్స్‌ ఫిరాయింపులతో వారు వెనక్కు వెళ్లడం తలవంపులు పరిస్థితిని సృష్టించింది.రాజస్థాన్‌లో మాజీముఖ్యమంత్రి వసుంధరారాజేవర్గం మళ్లీ కుంపటి రాజేస్తున్నది.ఎంతో చిన్నదైన లక్షద్వీప్‌లోకూడాబిజెపి విధానం ప్రతిఘటనపాలైంది. ఎపిలో ఆలయాల వివాదం పనిచేయక ఇప్పుడు టిప్పు సుల్తాన్‌ను పట్టుకున్నారు,తెలంగాణలో ఈటెలరాజేందర్‌ను చేర్చుకోవడానికి చూపిన హడావుడి బిజెపి పరిస్థితికి ఒక ప్రతిబింబంగా తయారైంది,కేరళలో కేంద్ర ఏజన్సీలతో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని ఏదో చేయాలనుకుంటే ఇప్పుడు బిజెపి రాష్ట్ర అద్యక్షుడు సుదీంద్రన్‌ అవినీతి ఆరోపణల్లో చిక్కారు,మోడీ రెండవసారిరాగానే కుట్రపూరితంగా జమ్మూకాశ్మీర్‌విభజన రాష్ట్రప్రతిపత్తితగ్గించి హక్కుల హరించేశారు. ప్రతిపక్ష నేతలందరినీ నిర్బంధంలోవుంచారు.మీడియాస్వేచ్చకు సంకెళ్లువేశారు.

కోలుకోలేని కాంగ్రెస్‌
బిజెపి సంగతి ఇలా వుంటే కాంగ్రెస్‌ కూడా ఎంతకూ కోలుకోలేకపోతున్నది. ఆ పార్టీ ముఖ్యనాయకులైన జితిన్‌ ప్రసాద్‌ వంటివారు బిజెపిలో చేరడం,రాజస్థాన్‌లో సచిన్‌పైలెట్‌ కేంద్రంగా అసమ్మతి పునరావృతం కావడం, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌పై నవజ్యోతి సిద్దు తదితరుల తిరుగుబాటు వంటివి ఎడతెగని సమస్యలుగా మారాయి.జితిన్‌ ప్రసాద్‌ నిష్క్రమణ తర్వాత జి23 లేఖ రాసిన వారు మరోసారి గొంతు విప్పారు. పార్టీ పునరుజ్జీవంపై సోనియా రాహుల్‌ నాయకత్వం తగువ్యూహం తీసుకోలేకపోతున్నదనే విమర్శలు విజృంభించాయి. తెలంగాణ పిసిసిఅద్యక్షుడి ఎంపికపై కూడా ఎడతెగనివాయిదాలతో గడిపేస్తున్నది.మొన్ననే ఓడిపోయిన కేరళలోనూ పిసిసిఅద్యక్షుడు శాసనసభా నాయకుడి నిర్ణయం వివాదమైంది.మహారాష్ట్ర ఎంవిఎ కూటమిలో శివసేన ఎన్‌సిపిలు కలసి వ్యవహరిస్తుంటే కాంగ్రెస్‌ వంటరిపాటుకు గురైంది.ఒక జాతీయ రాజకీయ శక్తిగా తన స్థానాన్ని వేగంగా బలహీనపర్చుకుంటున్నదనే అంచనాలు పెరుగుతున్నాయి.

ఇంతచేసినా అక్కడపరిస్తితిఅదుపులోకిరాకపోగాప్రధాన రాజకీయశక్తులు గుప్కార్‌అలయన్స్‌గాఏర్పడి కేంద్రాన్ని నిలదీశారు.రెండేళ్లలో అనుకున్నట్టు అదుపుసాధించలేకపోయిన కేంద్రం తొలిసారి రాష్ట్రంలో పార్టీలతో మాట్లాడి, అవసరమైతే మళ్లీ రాష్ట్రప్రతిపత్తి పునరుద్దరణకు కూడా సిద్ధం కావచ్చుననే వార్తలు వస్తున్నాయి. జరిగితే ఇది పెద్ద గుణపాఠమే అవుతుంది. సిఎఎను అయిదురాష్ట్రాలలో అమలు చేయడానికి కేంద్రం పరోక్షపద్ధతిలో ఆదేశాలిస్తే సుప్రీం కోర్టులో ఆక్షేపణఎదురైంది.దాంతో ఈ ఉత్తర్వులకు దానికిసంబంధం లేదనిసాకులు చెప్పాల్సి వచ్చింది.సిఎఎ వ్యతిరేక ఆందోళనలో అరెస్టయిన విద్యార్థి నాయకులనుకూడా ఢల్లీి హైకోర్టు విడుదలచేస్తే అందుకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది, అంతర్జాతీయంగానూ భావప్రకటనాస్వేచ్చపైన మతస్వేచ్చపైన మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదనే విమర్శను అంతర్జాతీయంగాకూడా కొనసాగుతూనే వుంది. ఇటీవలనే జి7 దేశాలసమావేశం సందర్భంగా మాట్టాడిన మోడీసోషల్‌మీడియా సంస్థల అదుపు అవసరాన్ని చెప్పడంయాదృచ్చికం కాదు.బడామీడియానుఎంతగాఅదుపుచేసినసోషల్‌మీడియాలోకేంద్రం పోకడలపై విమర్శలు పరగడంమింగుడుపడటంలేదు.రాబోయే రోజుల్లో ఈౖ దాడి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ప్రాంతీయ పార్టీలు తీరు

అధికారంలో వున్న లేని ఇతర ప్రాంతీయ పార్టీలు ఏమంత మెరుగ్గా లేవు. యుపిలో బిజెపి అంత ఇబ్బందిలో వుండగా ఎస్‌పి,బిఎస్‌పి కీచులాటలే కొనసాగుతున్నాయి. బిఎస్‌పి 19మంది ఎంఎల్‌ఎలలో ఏడుగురు మాత్రమే దానితో మిగిలారు.కొందరుఎస్‌పితో చేరారు.బిజెపిని ఎదుర్కొవడంలో ఈ రెండుపార్టీలూ ఎలా వ్యవహరిస్తాయనేది ఇంకా అస్పష్టం. ఎస్‌పి నేత అఖిలేష్‌పై దాడి కేంద్రీకరించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి పంజాబ్‌లో అకాలీదళ్‌తో అవగాహన కుదర్చుకున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మద్దతు కొనసాగింపుపై బేరసారాలు సాగుతున్నాయి. పంజాబ్‌ మధ్య ప్రదేశ్‌ వంటిచోట్ల కూడా బిఎస్‌పిగతంలో వున్న పట్టు కోల్పోయిందని ఎన్నికల వివరాలు చెబుతున్నాయి. బీహార్‌లో మూడోస్థానాసికి పడిపోయి ముఖ్యమంత్రి పదవి పొందిన నితిశ్‌ బిజెపిపై పరోక్ష విమర్శలు చేస్తూనే తమ బలంపెంచుకోవడానికి కాంగ్రెస్‌ వారిపైవల వేస్తున్నారు. చాలా కాలం తర్వాత లాలూయాదవ్‌ జైలునుంచి బెయిలుపై విడుదలైనారు. బెంగాల్‌లో తాజాగా మూడోసారి ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ శాంతి భద్రతల వైఫల్యంపై విమర్శలు ఎదుర్కొవడంతో పాటు కేంద్రంతో ఘర్షణ కొనసాగిస్తున్నారు.

తాను గతంలో పోషించిన పాత్రను మానేస్తున్నట్టు చెప్పిన ప్రశాంత్‌ కిశోర్‌ ఐ క్యాప్‌ టీంతో మమత మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకున్నారు.ఆమె జాతీయ స్తాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి నాయకులుగా వుంటారనే ప్రచారం సాగుతున్నా బలపర్చినవారు దాదాపులేరు.ఈపూర్వరంగంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్‌సిపి కురువృద్ధుడు శరద్‌పవార్‌తో సమావేశం కావడం ప్రత్యామ్నాయ వేదికకు పునాది అనిమరోప్రచారం వినిపించింది.అసలు పికెనే ప్రధాని మోడీకి సరైన ఢీ అని కూడా కథలు వినిపిస్తున్నాయి. ఒక ప్రచార వాణిజ్య మార్కెట్‌ సంస్థ దేశ రాజకీయాలలో ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుందనే కథనం వామపక్షేతర రాజకీయ పార్టీల దురవస్థను చెబుతుంది. గతంలో ప్రాంతీయ పార్టీల పోకడలను గమనించిన వారెవరైనా ఇంత తేలిగ్గా వాటి గురించి జోస్యాలు చెప్పరు. గతంలో రెండు మూడు సార్లు కూడా ఎన్నికల అనంతరమే రాజకీయ కూటములు ఏర్పడి కేంద్రంలో అధికారం చేపట్టాయి గాని మూడేళ్ల ముందే ఏర్పడిన దాఖలాలు లేవు. ఏర్పడినవి నిలబడిరదీ లేదు.ఒక్కరోజులో యునైటెడ్‌ ప్రంట్‌ కన్వీనర్‌ నుంచి ఎన్‌డిఎ సంధానకర్తగా మారిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వంటివారి ఉదాహరణలున్నాయి. ఇప్పుడూ ఆయన అడగకుండానే కేంద్రానిక మద్దతు ప్రకటించారు.

రాష్ట్రాలలో తమకు తిరుగులేదని భావించే నవీన్‌ పట్నాయక్‌, జగన్‌, కెసిఆర్‌ వంటివారు బిజెపితో పోరాడటానికి సిద్ధంగా లేరు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం రాష్ట్రాల తరపున గట్టిగా మాట్లాడుతున్నారు, ఈ మధ్య వాక్సిన్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌లేఖ రాయడం తర్వాత నవీన్‌ జగన్‌లు కూడా తమ పద్ఠతిలోస్పందించడం కేంద్రం దిగిరావాలసిన పరిస్తితిని సృష్టించింది, బిజెపి అందులోనూ మోడీ నాయకత్వం తన మౌలిక విధానాలు మార్చుకునేది వుండదుగనక మరింతగా అడుగుజారడం అనివార్యం, ఎన్నికల ముచ్చట అవివచ్చినప్పుడే! ఈలోగా రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశ్రేయస్సుకోసం ఉమ్మడిగా పోరాడితేనే కేంద్రం దిగివస్తుంది తప్ప ఎవరికివారు తమ అవకాశవాదాలలో కూరుకుపోతే తీరం చేరడం కుదిరేపని కాదు.వామపక్షాల ఆధ్వర్వంలో ఇప్పుడు దేశవ్యాపితంగా సాగుతున్ననిరసనోద్యమం,రైతాంగం ఉమ్మడిపోరాటం వంటివి అందుకు దారిచూపిస్తాయి.

Exit mobile version