Land For Jobs Scam Case: తేజస్వి యాదవ్‌పై ప్రశ్నల వర్షం.. 8 గంటలపాటు సీబీఐ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాల కోసం భూ కుంభకోణం(Land-For-Jobs Scam Case) కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను సీబీఐ ఈరోజు తన ప్రధాన కార్యాలయంలో ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు. కేసు విచారణ కోసం రావాలంటూ గతంలో సీబీఐ తేజస్వీయాదవ్ కు నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆయన ఉదయం 10:30 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అతన్ని విచారించారు. AB ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, AK ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు సంబంధించిన లింక్‌లతో సహా తేజస్వీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
Alsor Read:Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
తేజస్వీ యాదవ్‌ను ఈ నెలలో అరెస్టు చేయబోమని గత వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ 5న ముగియనున్న బీహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా సీబీఐ దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావడానికి కొంత సమయం కావాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తరపు న్యాయవాది మణీందర్ సింగ్ హైకోర్టుకు తెలియజేశారు.
Alsor Read:Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్..
అసెంబ్లీని శనివారాల్లో సమావేశపరచలేదని, యాదవ్ తన సౌలభ్యం ప్రకారం మార్చిలో ఏ శనివారమైనా ఏజెన్సీ ముందు హాజరుకావచ్చని సిబిఐ తరపు న్యాయవాది డిపి సింగ్ వాదించారు. మార్చి 25న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ అధికారి ఎదుట తేజస్వీ హాజరు అవుతారని మణీందర్ సింగ్ కోర్టుకు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 28, మార్చి 4, మార్చి 11 తేదీల్లో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఆర్జేడీ నేత తేజస్వీ కోరారు. ఇదే కేసులో యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవి, సోదరి మిషా భారతి తదితరులకు సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 15న బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ స్కామ్‌లో నిందితుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో సేకరించిన కొత్త వివషయాల ఆధారంగా ప్రశ్నలు సందిస్తోంది.
Alsor Read:Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు
కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి ప్రకటనలు, బహిరంగ నోటీసులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టమైన అభ్యర్థులను నియమించారని సీబీఐ ఆరోపించింది. ముంబై, జబల్పూర్, కోల్‌కతా, జైపూర్ , హాజీపూర్‌లోని వివిధ జోనల్ రైల్వేలలో పాట్నా నుండి ప్రత్యామ్నాయాలను నియమించినట్లు ఏజెన్సీ పేర్కొంది. ప్రతిఫలంగా అభ్యర్థులు నేరుగా లేదా వారి కుటుంబ సభ్యుల ద్వారా, లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అధిక రాయితీ ధరలకు భూమిని విక్రయించారని ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!