Site icon NTV Telugu

సెంచూరియన్ టెస్టులో టీమిండియా ఘనవిజయం

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 305 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే భారత బౌలర్లు అవుట్ చేశారు. దీంతో 113 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో ఎల్గర్(77), బవుమా(35), డికాక్(21) తప్ప మిగతా వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు సాధించగా… సిరాజ్, అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Read Also: బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 123 పరుగులు చేశాడు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 197 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 130 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల టార్గెట్ నిలిచింది. కాగా సెంచూరియన్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి టెస్టు విజయం.

Exit mobile version