Site icon NTV Telugu

దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొత్త షెడ్యూల్ విడుదల

తమ దేశంలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

Read Also: పెళ్లి మండ‌పంలోకి దూరి పెళ్లికూతురి నుదిటిపై తిల‌కం దిద్దిన యువ‌కుడు

టీమిండియా పర్యటన షెడ్యూల్:
తొలి టెస్టు-వేదిక: సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి 30 వరకు)
రెండో టెస్టు-వేదిక: జోహన్నెస్ బర్గ్ (జనవరి 3 నుంచి 7 వరకు)
మూడో టెస్టు-వేదిక: కేప్‌టౌన్ (జనవరి 11 నుంచి 15 వరకు)
తొలి వన్డే-వేదిక: పార్ల్ (జనవరి 19)
రెండో వన్డే-వేదిక: పార్ల్ (జనవరి 21)
మూడో వన్డే-వేదిక: కేప్‌టౌన్ (జనవరి 23)

Exit mobile version