Site icon NTV Telugu

రేకుల షెడ్డులో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన టీడీపీ నేత..

tdp leader

tdp leader

ప్రస్తుతం సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు.. కామ కోరికలతో రగిలిపోతూ తాము ఏంటి అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇక రాజకీయ నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వారు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. అయితే ఆ వివాదాలు ఎలాంటివి అనేది సమస్యగా మారింది. తాజాగా ఒక నేత వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ముందు వెనక చూసుకోకుండా రేకుల షెడ్డులో అమ్మాయితో శృంగారం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన తుళ్లూరు లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే అమరావతి దళిత జేఏసీ నేత కమ్ టీడీపీ నాయకుడు చిలకా బసవయ్య రాయపూడి 6 మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఉన్న ఒక రేకుల షెడ్డులో రాసలీలల చేస్తూ పోలీసులకు దొరికాడు. రేకుల షెడ్డు బయట ఒక వ్యక్తిని కాపలా పెట్టి.. లోపల అమ్మాయితో శృంగారంలో మునిగి తేలుతున్న అతనిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు యువతికి మాయమాటలు చెప్పి, ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడని తెలుస్తోంది. ఈ ఘటనఫై పోలీసులు కేసు నమోదు చేసుకొని టీడీపీ నేతను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

Exit mobile version