NTV Telugu Site icon

అజ్ఞాతంలో టీడీపీ నేత పట్టాభి.. ఎక్కడున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఉక్కసారి కాకరేపిన టీడీపీ నేత పట్టాభిరామ్‌.. ఇప్పుడు ఎక్కడున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.. సీఎం వైఎస్‌ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటితో పాటు, టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.. ఇక, సీఎంను వ్యక్తిగతంగా దూషించిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు.. అయితే, పట్టాభి ఇప్పుడు మాల్దీవ్స్‌కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

Read Also : యూపీలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి ఇద్దరు కీలక నేతల గుడ్‌బై

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లిన పట్టాభిరామ్‌.. ఆ తర్వాత మాల్దీవ్స్‌కు వెళ్లిపోయినట్టు సమాచారం. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన మాలేకు చేరినట్టు తెలుస్తోంది. ఇక, ఆయన ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన దృష్ట్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి.. ఆయన బెయిల్‌పై రాజమండ్రి జైలు నుంచి విడుదల కాగా.. ఘన స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణుల.. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఓ వాదన.. లేదు మళ్లీ అరెస్ట్‌ చేశారంటూ మరో ప్రచారం జరిగింది. కానీ, పట్టాభి మాల్దీవ్స్‌కు వెళ్లినట్టుగా చెబుతున్నారు. మరోవైపు.. పట్టాభి వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై 36 గంటల పాటు దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లింది చంద్రబాబు టీమ్‌.