NTV Telugu Site icon

దుగ్గిరాల ఎంపీపీపై పెరుగుతున్న ఉత్కంఠ‌త‌…

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల ఎంపీపీ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుంది అనేదానిపై ఉత్కంఠ‌త నెల‌కొన్న‌ది.  దుగ్గిరాల ఎంపీటీసీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ 9 చోట్ల‌, వైసీపీ 8 చోట్ల, జ‌న‌సేన 1 చోట విజ‌యం సాధించింది.  అయితే, ఎంపీపీ ప‌ద‌వి ద‌క్కాలి అంటే క‌నీసం 9 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు అవ‌స‌రం.  టీడీపీకి 9 మంది ఎంపీటీసీలు ఉన్న‌ప్ప‌టికీ ఆపార్టీ ఎంపీపీ అభ్య‌ర్థి షేక్ జ‌బీనాకు కుల దృవీక‌ర‌ణ ప‌త్రం రాక‌పోవ‌డంతో టీడీపీ నేత‌లు ఈ ఎంపీపీ  ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  వైసీపీకి 8 ఎంపీటీసీలు మాత్ర‌మే ఉన్నారు.  మ‌రోక‌రి స‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రి.  మ‌రి జ‌న‌సేన పార్టీ వైసీపీకి మ‌ద్ధ‌తు ఇస్తుందా లేదా చూడాలి.  ఆచంట‌లో కూడా ఇదేవిధ‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వ్వ‌గా జ‌న‌సేన టీడీపీకి మ‌ద్ధతు ఇచ్చింది. 

Read: అసెంబ్లీలో జారిన పంచే… న‌వ్వు ఆపుకోలేక‌పోయిన స్పీక‌ర్‌…