మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మహిళలను వివిధ రకాలుగా టీజ్ చేస్తూనే ఉంటారు. మహిళలపై అఘాయిత్యాలు, టీజింగ్ పేరుతో హింసించడం, సోషల్ మీడియాలోనూ మహిళలను కించపరిచే విధంగా ఫొటోలు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇది సాధారణ మహిళల నుంచి స్టార్ వరకు, వ్యాపారవేత్తల వరకు జరుగుతూనే ఉంటుంది. చాలా మంది పట్టించుకోకుండా సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతుంటారు. ఒకవేళ పట్టించుకున్నా, ఎందుకులే అని లైట్‌గా తీసుకుంటారు. అయితే తరుణ్ కతియల్ దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. తన భార్యకు జరిగిన అవమానానికి బదులుగా ఓ పెద్ద ప్రపంచాన్నే సృష్టించారు.
Read: ప్రత్యక్షసాక్షి ఆవేదన: దేశంకోసం ఇంతచేసిన వ్యక్తికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయాం…
అందులో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడ తమకు జరిగిన అన్యాయం గురించి మరోక మహిళతోనో వారి గ్రూప్ మహిళలతోనో చెప్పుకొవచ్చు. మహిళల సమస్యలను మహిళలు తెలుసుకునేందుకు, వాటిని పరిష్కరించుకునేందుకు ఆ ప్రపంచం ఉపయోగపడుతుంది. ఆ ప్రపంచం పేరు ఈవ్. ఈవ్ సోషల్ మీడియా కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ మీడియా ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే కాకపోవచ్చు. కానీ, వారి సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్ ఉందనే భరోసా కలుగుతుందని తరుణ్ కతియల్ పేర్కొన్నారు.