ప్ర‌త్య‌క్ష‌సాక్షి ఆవేద‌న‌: దేశంకోసం ఇంత‌చేసిన వ్య‌క్తికి మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేక‌పోయాం…

నిన్న మ‌ధ్యాహ్నం సీడిఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణం చేస్తున్న హెలికాప్ట‌ర్ కూనూరు వ‌ద్ద కూలిపోయిన సంగ‌తి తెలిసిందే. టీ ఎస్టేట్‌కు స‌మీపంలో కూలిపోవ‌డంతో అందులో ప‌నిచేస్తున్న కూలి శివ అనే వ్య‌క్తి వెంట‌నే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మంట‌ల్లో కాలిపోతున్న ఓ వ్య‌క్తిని చూశాన‌ని, మంచినీళ్లు అడిగార‌ని, అయితే, నీళ్లు ఇవ్వ‌కుండా గుడ్డ‌లో చుట్టి పైకి తీసుకెళ్లి ఆర్మీకి అప్ప‌గించాన‌ని, మూడు గంట‌ల త‌రువాత చ‌నిపోయి ఆ వ్య‌క్తి బిపిన్ రావ‌త్ అని, దేశానికి ఎంతో సేవ‌చేసిన వ్య‌క్తికి తాను మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేక‌పోయామ‌ని కంట‌త‌డి పెట్టుకున్నారు.

Read: ఒమిక్రాన్‌ వేరియంట్ పై డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రాత్రంతా త‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌లేద‌ని ఆ ప్ర‌త్య‌క్ష‌సాక్షి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో చెప్పారు. స‌ల్లూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్ట‌న్ ఆర్మీ కాలేజీకి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సీడీఎస్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య‌, మ‌రో 11 మంది ఆర్మీ అధికారులు మృతి చెందారు.

Related Articles

Latest Articles