టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్ జైలర్ మాత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..
లస్ట్ స్టోరీస్ 2 అనే చిత్రంలో నటించింది. ఇందులో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి అనేక ఈవెంట్స్, పార్టీలలో కలసి పాల్గొనడంతో వీరి డేటింగ్ విషయం బాలీవుడ్ మీడియాపై కోడై కూసింది. ఇక లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్లలో తమ ప్రేమ గురించి బయటపెట్టింది తమన్నా. తాజాగా వీరిద్దరు కలిసి ముంబైలో ఓ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.. బ్లూ కలర్ డ్రెస్సులో మెరిసిపోతుంది తమ్ము..
ఇకపోతే ఇంటర్నేషనల్ బ్రాండ్ LaQuan స్మిత్ డిజైన్ చేసిన మాక్ నెక్ గౌను ధరించింది. ఈ డ్రెస్ ధర $2.550. అంటే భారతీయ కరెన్సీలోకి మారిస్తే..దాదాపు రూ.2,06,399. మెటాలిక్ గ్రేప్ అవుట్‌ఫిట్ లో తమన్నా మరింత అందంగా కనిపిస్తున్నప్పటికీ ఆ డ్రెస్ ధర తెలిసి నెటిజన్స్ నోర్లు వెళ్ల బెడుతున్నారు.. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో `బోలే చుడియాన్`, మలయాళంలో అరుణ్ గోపి దర్శకత్వంలో `బాంద్రా` సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో ఓ రెండు ప్రాజెక్ట్ లకు కమిట్ అయింది. చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతుంది.. అలనాటి అందాల తార దివంగత హీరోయిన్ దివ్య భారతి బయోపిక్ లో తమన్నా నటించనున్నట్లు తెలుస్తోంది..