NTV Telugu Site icon

అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్

యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని బీసీసీఐ మొదట కొట్టిపారేసింది. కానీ నిన్న స్వయంగా కోహ్లీనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను ఏ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలిపాడు. అయితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు ఎవరు చెప్పటనున్నారు అనే విషయం చర్చ జరుగుతుంది. ఇక తాజాగా భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ విషయం పై స్పందిస్తూ… భారత కొత్త కెప్టెన్ గా ఓపెనర్ కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడు అని తెలిపాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మను కెప్టెన్ ను చేయాలనీ బీసీసీఐ చూస్తుందని.. కాబట్టి టీం ఇండియా వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని నియమించాలని సూచించాడు. 34 ఏళ్ళ రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇప్పుడు అప్పగించిన బీసీసీఐ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని తెలిపాడు. కాబట్టి ఇప్పుడు రాహుల్ ను వైస్ కెప్టెన్ చేస్తే.. రాబోయే రోజుల్లో అతను కెప్టెన్ గా జట్టును సమర్ధవంతంగా నడపగలదని అన్నారు.