ఇప్పటి వరకు ప్రతి ఆదివారం రోజున ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్‌డే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద నిర్వహించడానికి పట్టణాభివృద్ధి శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండేఫండే కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందని, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు ఆనందాన్ని వ్యక్తం చేశారని, ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్దకూడా నిర్వహించాలని సూచించారని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పైర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రజలు నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని అరవింద్ కుమార్ పేర్కొన్నారు. చార్మినార్ వద్ద నైట్‌లైఫ్ కు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలో తేలిందని ఆరవింద్ కుమార్ తెలిపారు.
Read: వీడు మాములోడు కాదు…ఒకటి కాదు రెండు కాదు… ఆరు పెళ్లిళ్లు…