వీడు మాములోడు కాదు…ఒక‌టి కాదు రెండు కాదు… ఆరు పెళ్లిళ్లు…

దేశంలో పెళ్లికాని ప్ర‌సాదుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు.  అయితే, ఓ వ్య‌క్తి మాత్రం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు.  అమ్మాయిల‌ను న‌మ్మించి వ‌ల్లో వేసుకోవ‌డం, పెళ్లిళ్ల పేరుతో మోసం చేయ‌డం, ఆ త‌రువాత అవ‌సరాలు తీర్చుకొని వ‌దిలేయ‌డం చేస్తున్నాడు.  ఇలా మోసాలకు పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకొని జైలుకు త‌ర‌లించారు.  ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడు రంగ‌సామికి ప‌దేళ్ల‌పాటు కారాగార శిక్ష‌ను విధించింది.  అనంత‌పురం జిల్లాకు చెందిన రంగ‌సామి ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌చ్చి ఇక్క‌డే స్థిర‌ప‌డ్డాడు.  హైద‌రాబాద్ వ‌చ్చిన త‌రువాత పెళ్లైన మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకొని వాళ్ల‌ను ట్రాప్‌లోకి దించేవాడు.  ప‌రిచ‌యం చేసుకొని లోబ‌రుచుకునేవాడు.  డ‌బ్బులుండి, భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసేవాడు.  హైద‌రాబాద్‌లోని లాలాగూడా కు చెందిన ఓ మ‌హిళ‌ను మోసం చేయ‌డంతో రంగ‌సామిపై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.  దీంతో పోలీసులు రంగ‌సామిని అరెస్ట్ చేసి విచార‌ణ చేశారు.  పోలీసుల విచార‌ణ‌లో అనేక విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  గ‌తంలో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, చైన్ స్నాచింగ్‌, దొమ్మీలు ఇలా 12 కేసులు రంగ‌సామిపై ఉన్నాయి.  అప్ప‌ట్టో రెండేళ్ల‌పాటు జైలు శిక్ష‌ను కూడా అనుభ‌వించాడు.  

Read: అక్టోబ‌ర్ 12, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు

-Advertisement-వీడు మాములోడు కాదు...ఒక‌టి కాదు రెండు కాదు... ఆరు పెళ్లిళ్లు...

Related Articles

Latest Articles