NTV Telugu Site icon

ఇండియా పై మరో దేశం ఆంక్షలు…

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో దేశంలో ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి.  కొన్ని దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  ఈ లిస్టులో ఇప్పుడు సూడాన్ చేరిపోయింది. భారత ప్రయాణికులపై రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది.  భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుడాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  భారత్ తో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా దేశాల ప్రయాణికులపై కూడా సుడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.