ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు టెన్షన్ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి.. ఇప్పుడు యూపీ ఎన్నికలపై స్పందించిన తీరు సంచలనంగా మారింది. ఆశ్చర్యపోకండి…! యూపీలో రాష్ట్రపతి పాలన రాబోతోంది… అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి అంటూ సోషల్ మీడియా వేదిక తన అభిప్రాయాలను పంచుకుని పొలిటికల్ హీట్ పెంచారు సుబ్రమణ్యస్వామి.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని జోస్యం చెప్పిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు వాయిదా పడతాయని చెప్పుకొచ్చారు.. యూపీ ఎన్నికలపై ట్వీట్ చేసిన స్వామి.. “ఒమిక్రాన్ కోసం లాక్‌డౌన్ మరియు యూపీలోలో రాష్ట్రపతి పాలన.. యూపీ ఎన్నికలను సెప్టెంబర్‌కు వాయిదా వేయడం గురించి ఆశ్చర్యపోకండి..! ఈ సంవత్సరం ప్రారంభంలో నేరుగా చేయలేనిది వచ్చే ఏడాది ప్రారంభంలో పరోక్షంగా చేయవచ్చు” అంటూ రాసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలను ఆపేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి కోరిన నేపథ్యంలో స్వామి ఈ జోస్యం చెప్పారు. మరి యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.. ప్రధాని నరేంద్ర మోడీ మదిలో ఏముంది అనేది ఆసక్తికరంగా మారింది.
