Site icon NTV Telugu

Stormy Daniels: ట్రంప్‌కు లీగల్ ఫీజు చెల్లించండి.. డేనియల్స్‌కు కోర్టు ఆదేశం

Stormy Daniels

Stormy Daniels

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువునష్టం కేసులో పోర్న్ స్టార్ డేనియల్స్‌కు చుక్కెదురయ్యింది. కోర్టు ఫీజు భాగంగా ట్రంప్‌ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. కాలిఫోర్నియాలోని 9వ యూఎస్‌ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌.. డేనియల్స్‌ వాదనను తోసిపుచ్చింది. దీంతో కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్‌ తరఫు న్యాయవాదులకు లక్షా 20 వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. మన్‌హటన్‌ న్యాయస్థానంలో ట్రంప్‌ హాజరైన రోజే మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా ఈ తీర్పు రావడం గమనార్హం.
Also Read: Samantha: నీ కష్టాలకు కన్నీళ్లు పెట్టగలమే కానీ నీ కర్మను పంచుకోలేం

డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌ మన్‌హటన్‌లోని కోర్టు ఎదుట హాజరుపరిచారు. మొత్తం 34 అభియోగాలను ఆయనపై మోపారు. వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్‌ విన్నవించారు. ట్రంప్ లీగల్ ఫీజులో $600,000 కంటే ఎక్కువ చెల్లించాలని డేనియల్స్‌ను ఆదేశించారని ఈ కేసులో అతని న్యాయవాది హర్మీత్ డిల్లాన్ ట్వీట్ చేశారు. ఇందులో డానియల్స్ గతంలో చెల్లించాలని ఆదేశించిన అటార్నీ ఫీజులో దాదాపు $300,000 కూడా ఉంది.
Also Read: Rajasthan Royals vs Punjab Kings: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్

డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్. 2006లో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బహిర్గతం కాని ఒప్పందంలో భాగంగా $130,000 చెల్లించారని ఆరోపించింది. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన తర్వాత ఆమె ట్రంప్‌పై పరువు నష్టం దావా వేసింది. డేనియల్స్‌ 2018లో కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 2018లో వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ పరువునష్టం కేసులో స్టార్మీ డేనియల్స్‌ ఓడిపోవడంతోపాటు లీగల్‌ ఫీజు కింద ఆమె 2.93లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అనంతరం పై కోర్టులో అప్పీలు చేసుకోగా.. అక్కడ కూడా మరో 2.45లక్షలు ఫైన్‌ పడింది. తాజా అప్పీలులోనూ స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురయ్యింది. దీంతో మొత్తంగా ఆమె దాదాపు 6లక్షల డాలర్లకుపైగా ట్రంప్‌ తరఫు అటార్నీలకు చెల్లించాల్సి ఉంది.

Also Read: Apple retail store: భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్‌… ఎక్కడ ఉందో తెలుసా?

కాగా, చెల్లింపులకు సంబంధించిన వ్యాపార రికార్డులను తప్పుదోవ పట్టించినందుకు ట్రంప్‌పై 34 అభియోగాలు మోపారు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై నేరారోపణలు జరగడం ఇదే తొలిసారి. ట్రంప్ అటార్నీ హర్మీత్ డిల్లాన్ ట్విట్టర్‌లోకి వెళ్లి ఆర్డర్ కాపీని పంచుకున్నారు. “ఈ రోజు ఉదయం తనకు అనుకూలంగా వచ్చిన ఈ తుది అటార్నీ ఫీజు విజయంపై అధ్యక్షుడు ట్రంప్‌కు అభినందనలు.” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్రంప్‌ అరెస్టుకు, ఈ సివిల్‌ కేసుకు సంబంధం లేనప్పటికీ రెండు కూడా స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.

Exit mobile version