కరోనా మహమ్మారి బారినపడి చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం.. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా ఇస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని పొందాలంటే సదరు వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే మృతిచెందినవారి కుటుంబాలకే కాకుండా.. భవిష్యత్లులో కోవిడ్‌తో మృతిచెందేవారి కుటుంబాలకు కూడా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు.
అయితే, ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నుంచి సేకరించబడతాయి మరియు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా జిల్లా పరిపాలన ద్వారా పంపిణీ చేస్తారు.. ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. కాగా, కరోనాతో 2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటికే మృతిచెందినవారి సంఖ్య 4.45 లక్షలకు పైగా నమోదైంది.. కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న లేదా సంసిద్ధత కార్యకలాపాలలో పాల్గొన్న మరణించిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నారు.. అయితే, ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం.. కరోనాతో మృతిచెందినట్టు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు అన్ని క్లెయిమ్‌లు పరిష్కరించబడాలి.. ఆధార్‌తో అనుసంధానించబడిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రక్రియల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొంది కేంద్రం.
