Site icon NTV Telugu

ఈ ఇసుక కోస‌మే అక్క‌డి ప్ర‌జ‌లు ఆ బీచ్‌కు వెళ్తార‌ట‌…ఎందుకంటే…

ఏ స‌ముద్ర తీరానికి వెళ్లినా మ‌న‌కు బీచ్‌లు క‌నిపిస్తాయి.  బీచ్‌ల్లో ఇసుక క‌నిపిస్తుంది.  అయితే, అన్ని బీచ్‌ల సంగ‌తి ఎలా ఉన్నా, జ‌పాన్‌లోని ఇరుమోటే ఐలాండ్‌లోని బీచ్ వేరుగా ఉంటుంది.  అక్క‌డ మ‌న‌కు తెల్ల‌ని ఇసుక క‌నిపిస్తుంది.  ప్ర‌జ‌లు అక్క‌డ ఒట్టికాళ్ల‌తో తిరుగుతుంటారు.  కాళ్ల‌కు అంటుకున్న ఇసుక‌ను జాగ్ర‌త్త‌గా ఇంటికి తెచ్చుకొని భ‌ద్ర‌ప‌రుచుకుంటుంటారు.  ఇలా కాళ్ల‌కు అంటుకున్న ఆ బీచ్‌లోని ఇసుక‌ను ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచి జ‌రుగుతుంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తుంటారు.  దీనికి కార‌ణం లేక‌పోలేదు.  అక్క‌డి ఇసుక‌రేణువులు మిగ‌తా ప్రాంతాల్లోని ఇసుక‌తో పోలిస్తే ఢిఫ‌రెంట్‌గా ఉంటాయి.  ఇరుమోటే బీచ్‌లోని ఇసుక రేణువులు స్టార్ ఫిష్ ఆకారంలో ఉంటాయి.  కొన్ని కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఏక‌క‌ణ‌జీవులైన ప్రోటోజోవా స‌ముద్రం నుంచి కొట్టుకొని వ‌చ్చి ఇసుక‌లో క‌లిసిపోయాయి.  ఆ ప్రోటోజోవా మ‌ర‌ణించిన త‌రువాత వాటిపై ఉంటే క్యాల్షియం పొర‌లు నీటి తాకిడికి అరిగిపోయి స్టార్ ఫిష్ ఆకారంలోకి మారిపోయాయి.  ఇరుమోటే బీచ్‌లో ఎక్క‌డ చూసినా ఇలాంటి ఇసుక రేణువులే క‌నిపిస్తుంటాయి. కాళ్ల‌కు అంటుకున్న ఇసుక‌ను మాత్ర‌మే ఇంటికి తీసుకొని వస్తార‌ని, అలాంటి ఇసుక ఇంట్లో ఉంటే మంచిది అని చెబుతున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు.  

Read: హుజురాబాద్ ఉప ఎన్నిక పై దళిత బంధు పథకం ప్రభావం ఉంటుందా..?

Exit mobile version