తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చాలామంది భక్తులు తిరుపతిలోని అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఒకసారి కాలినకడన ఎక్కడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ భక్తులు 300 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. 1996లో మొదటిసారి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్న శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు ఆ తరువాత శ్రీవారిపై తనకున్న భక్తిని చాటుకునేందుకు 2018 వరకు అంటే 22 ఏళ్లలో 175 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. కాగా, ఈ మూడేళ్ల వ్యవధిలో ఏకంగా 125 సార్లు అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకు చేరుకున్నాడు. నిన్న శనివారం 300 వ పర్యాయం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు.
Read: నారా లోకేష్ సంచలన ట్వీట్: ఏపీలో ఆ డ్రగ్స్ డాన్ ఎవరు?