Site icon NTV Telugu

Ramadan 2022 : ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌

Telangana Govt

Telangana Govt

తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అయితే ముస్లింలకు పవిత్ర మాసంగా భావించే రంజాన్‌ నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 2 నుంచి మే2 వరకు రంజాన్‌ ఉపవాసాలు జరుగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్‌ వెలుసుబాటు కల్పించింది. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ముస్లిం సోదరులు ఈ నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో ఉపవాసాలు ఉంటూ.. ప్రార్థనలు చేస్తారు. అయితే వారి ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సాయంత్రం గంట ముందే ఇంటికి వెళ్లే విధంగా అనుమతిస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ వెసులుబాటు అన్ని ప్ర‌భుత్వ శాఖలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే ముస్లిం ఉద్యోగులంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Exit mobile version