ఏపీ రాజకీయాను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసునని ఆయన వెల్లడించారు. పత్రిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా సభలో రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన అనుభవాన్ని చంద్రబాబు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.