సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల జట్టు 197 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును బవుమా కాపాడాడు. బవుమా ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. బవుమా (52), డికాక్ (34) రాణించారు. బౌలర్ రబాడ బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ చివర్లో అతడు 25 పరుగులు చేశాడు.
Read Also: తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు భారత్ ఆలౌట్
భారత బౌలర్లలో మహ్మద్ షమీకి 5 వికెట్లు పడ్డాయి. షమీ 16 ఓవర్లు బౌలింగ్ వేసి 44 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. బుమ్రా 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లతో రాణించారు. మహ్మద్ సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో గాయపడి మైదానం వీడిన బుమ్రా దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయిన తర్వాత మళ్లీ వచ్చి ఓ వికెట్ తీశాడు. కాగా టీమిండియాకు 130 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం నైట్ వాచ్‌మన్ శార్దూల్ (4), కేఎల్ రాహుల్ (5) క్రీజులో ఉన్నారు. భారత్ 146 పరుగుల ఆధిక్యంలో ఉంది.
