ప్రస్తుతం భారత క్రికెట్ లో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ విరుద్ధంగా మాట్లాడటంతో అది మరింత ముదిరింది. అయితే టీ20 కాప్రిన్సీ నుంచి తప్పుకోవద్దని తాను కోహ్లీకి చెప్పినట్లు గంగూలీ ప్రకటించగా… తనకు అలాంటిది ఏం చెప్పలేదు అని విరాట్ అన్నారు. అయితే తాజాగా గంగూలీ… విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యల పై మాట్లాడేందుకు నిరాకరించారు. నేను దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లవద్దు అని అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏమీ లేదు” అని సౌరవ్ గంగూలీ అన్నారు.
అలాగే దక్షిణాఫ్రికా టూర్ తర్వాత విరాట్ కోహ్లీ పై చర్యలు తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ.. ‘నేను చెప్పేది ఏమీ లేదు.. అది బీసీసీఐకి సంబంధించిన విషయం, వాళ్లు మాత్రమే డీల్ చేస్తారు అని పేర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో… డిసెంబర్ 26న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.