NTV Telugu Site icon

త్వరలో ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు

ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే… డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూపీఐ ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. ఇది ఇలా ఉండ‌గా… కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ముందుగా ఊహించినట్లుగానే ఆర్బీఐ ఎంపీసీ ఈ రేట్లను యథాతథంగా… కొనసాగించేందుకు ఓటు వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాన్ని 9.5 శాతంగా ఉంచింది. ఆర్బీఐ ద్వైమాసిక విధాన రేట్లను యథాతథంగా కొనసాగించడం ఇది తొమ్మిదోసారి. ఒమైక్రాన్ ప్రభావంపై విధాన నిర్ణేతలు అంచనా వేస్తుండటంతో… ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతుంది.