రీల్ నటుడు సోనూసూద్ కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో పేదలకు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన చేసిన సహాయక చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అంతటితోనే తన సేవను ఆపేయకుండా దేశవ్యాప్తంగా పేషంట్ల కోసం ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ప్రారంభించారు. ఇక ఆయనకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా చాలామంది సహాయం కోరుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు తుంటరి నెటిజన్లు మాత్రం అప్పుడప్పుడూ సోనూసూద్ ను సోషల్ మీడియాలో చిత్రమైన కోరికలు కోరుతుంటారు. అందుకు ఆయన కూడా విచిత్రంగానే స్పందిస్తూ ఉంటారు.
Read Also : వ్యాక్సినేషన్ వేయించుకున్న స్టార్ కపుల్
తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ నెటిజన్ “నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతోంది. దానికి మీరు సహాయం చేయగలరా?” అని ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన సోనూ “నాకు దాని గురించి తెలియదు కాని… నేను ఆమెకు ఫోన్ కొనిస్తే దాని నుండి మీరు మాత్రం ప్రయోజనం పొందలేరు” అంటూ హిలేరియస్ గా రిప్లై ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
उसका तो पता नहीं,
— sonu sood (@SonuSood) June 22, 2021
अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा😂 https://t.co/t99rnT8z22