NTV Telugu Site icon

బద్వేల్ ఎన్నికల్లో వైసీపీకి ప్యాంటులు తడిచిపోయాయి : సోము వీర్రాజు

ఏపీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేనులు ప్రజాగ్రహ సభ సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్న పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సంబరాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, సీపీఐ పార్టీల మీద నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతుందని, ఏపీలో శూన్యత ఉందని ఆయన అన్నారు.

ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలుంటే.. బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మేం ట్రేడింగ్ చేయం.. రూలింగ్ చేస్తామంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉద్యమించనున్నామని, ఉత్తరాంధ్ర జిల్లాలో బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క హర్బర్, బెర్తుల్లేవా..? రాష్ట్ర మత్స్య శాఖ మంత్రికి ఎంత బడ్జెట్ ఉంటుందో.. అంత నిధులను మేం ఒక్క బెర్త్ కోసం కేటాయిస్తున్నాం.

నెల్లూరు జిల్లాను ఓ నేతకు లీజ్ ఇచ్చారు.. ఇప్పుడాయన రాజ్యసభ ఎంపీ. గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి నుంచి రూ. 100 కోట్లు తీసుకుని అతనికి బెర్తుల నిర్మాణం పనులన్నీ కేటాయించేశారు. వైసీపీ లీజుల గురించి మాట్లాడితే ఆ పార్టీ నేతల చొక్కాలు కూడా ఉండవు. బద్వేల్ ఎన్నికల్లో వైసీపీకి ప్యాంటులు తడిచిపోయాయి. కరపత్రం ఎన్నికలు జరుగుంటే బీజేపీకి 40 వేల ఓట్లు వచ్చేవి. కానీ వైసీపీ డబ్బులు పంచింది..? ఏజెంట్లను కొన్నది..? మా పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుని కోసం 50 కార్లు వెళ్లాయంటూ ఆయన ఆరోపించారు.