Site icon NTV Telugu

ధూమ‌పాన ప్రియుల‌కు షాక్‌: పొగ‌తాగే వారికే క‌రోనా రిస్క్ అధికం…

ధూమ‌పానం, మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం.  ఈ విష‌యాలు తెలిసిన‌ప్ప‌టికీ  పొగ‌తాగ‌డం మాన‌డం లేదు.  పొగ తాగ‌డం వ‌ల‌న ఊపిరితిత్తులు పాడైపోయే అవ‌కాశం ఉంది.  శ్వాస‌సంబంధ‌మైన జబ్బులు వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉంటాయి.  ఇక‌, పొగ‌తాగ‌డం వ‌ల‌న గుండెసంబంధ‌మైన జ‌బ్బులు అధికంగా వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.  గుండెజ‌బ్బుల‌తో పాటు, క్యాన్స‌ర్ వంటివి కూడా సోకే అవ‌కాశం ఉంటుంది.  ఇది ఇలా ఉంచితే క‌రోనా మ‌హమ్మారి ప్ర‌స్తుతం వేగంగా విస్త‌రిస్తోంది.  క‌రోనా వైర‌స్ శ్వాస‌వ్య‌వ‌స్థ‌ను మ‌రింత దెబ్బ‌తీస్తుంది.  ధూమ‌పానం అల‌వాటు ఉన్న‌వారికి క‌రోనా సోకితే దాని వ‌ల‌న రిస్క్ మ‌రింత అధికంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  రిస్క్ అధికంగా ఉండ‌ట‌మే కాకుండా, మ‌ర‌ణించే అవ‌కాశం కూడా అధికంగా ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Read: రికార్డ్‌: ఆ బ్యాగ్ ఖ‌రీదు అక్ష‌రాల రూ. 2.75 కోట్లు…

Exit mobile version