Site icon NTV Telugu

బంప‌ర్ ఆఫ‌ర్‌: వ్యాక్సిన్ వేయించుకుంటే…స్మార్ట్ ఫోన్ ఫ్రీ…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  అయితే, గ‌త కొన్ని రోజులుగా ఈ ప్ర‌క్రియ మంద‌కోడిగా సాగుతోంది.  వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేసేందుకు ప్ర‌భుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి.  బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి.  ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌మాదం పొంచియున్న నేప‌థ్యంలో 100 శాతం వ్యాక్సినేష‌న్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వాలు స‌న్న‌ద్ధం అవుతున్నాయి.  

Read: వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్‌…

గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వినూత్నంగా ఆలోచించి బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.  డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 7 మ‌ధ్య ఎవ‌రైతే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుంటారో వారిలో ఒక‌రిని ల‌క్కీడ్రా తీసి గెలుపొందిన వారికి రూ.60000 విలువ చేసే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.  దీంతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి కేంద్రాల‌కు వ‌స్తున్నారు.  గ‌తంలో కూడా ఇలానే మురికివాడ‌ల్లో వ్యాక్సినేష‌న్ వేయించుకున్న వారికి కిలో వంట నూనెను ఫ్రీగా అందించారు.  

Exit mobile version