ప్రపంచ గమనాన్ని మార్చిన భౌతిక సిద్దాంతాల్లో ఒకటి గురుత్వాకర్షణ సిద్ధాంతం. దీనిని న్యూటన్ శాస్త్రవేత్త కనుగోన్న సంగతి తెలిసిందే. చెట్టునుంచి యాపిల్ పండు కిందపడిన సమయంలో వచ్చిన ఓ చిన్న ఆలోచనతో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. 1666లో న్యూటన్ వేసవి కాలంలో తన తోటలో సరదాగా తిరుగుతూ యాపిల్ చెట్టుకింద పడుకొని నిద్రపోయారు. ఆ సమయంలో ఆ చెట్టునుంచి యాపిల్ పండు న్యూటన్ తలపై పడింది. నిద్రకు భంగం కలగడంతో యాపిల్ పండుపై కోపం వచ్చింది. ఆ తరువాత ఆలోచన వచ్చింది. యాపిల్ పండు కింద ఎందుకు పడింది. చెట్టునుంచి పండు పైకి వెళ్లవచ్చుకదా అనుకున్నాడు. చెట్లు భూమి నుంచి పైకి ఎందుకు పెరుగుతున్నాయి అని ఆలోచించాడు. పైకి విసిరేసిన ఏ వస్తువైనా కిందపడుతుందని గుర్తించాడు. కారణం భూమి గురుత్వాకర్షణ అని కనిపెట్టాడు.
Read: వంటగది నుంచి బిలియన్ డాలర్లవైపు…
ఇది జరిగి ఇప్పటికి 350 సంవత్సరాలు దాటింది. అప్పట్లో న్యూటన్ యాపిల్ చెట్టు ఇప్పటికీ ఇంకా బతికే ఉందట. సాధారణంగా యాపిల్ చెట్లు 50 నుంచి 80 ఏళ్ల వరకు బతుకుతాయి. 350 సంవత్సరాల నుంచి ఎలా బతికే ఉన్నది అన్నది ఆశ్చర్యం. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతాన్ని రూపొందించిన తరువాత ఆ చెట్టును ప్రత్యేక పద్ధతుల్లో పెంచడం ప్రారంభించారు. నిత్యం చెట్టు కొమ్మలు ఎక్కువగా పెరగకుండా తక్కువ ఎత్తులో ఉండేలా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ చెట్టును ప్రత్యేక పద్దతుల్లో పెంచుతుండటంతో ఇప్పటికీ ఆ చెట్టు బతికే ఉన్నది.