Site icon NTV Telugu

సింగరేణి కార్మికుల సమ్మె యథాతథం

హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పాటు… కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఆర్‌ఎల్‌సీ, సింగరేణి అధికారులతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని, ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి చొరవ చూపాలని సూచించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మె చేసి తీరుతామని స్పష్టం చేశారు జేఏసీ నేతలు.

సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడానికి ఈనెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేయక తప్పదన్నారు. కార్మికులు సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల పిలుపునిచ్చారు. ఇవాళ అన్ని యూనియన్లు తిరిగి సమావేశమై సీఎండీ, సీఎం, అలాగే ఎంపీలకు, కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం అందజేయాలని నిర్ణయించారు కార్మిక జేఏసీ నేతలు. మొత్తానికి సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు ఒక్కటయ్యాయె. సమ్మెపై సంస్థ యాజమాన్యం ఎలా స్పందిస్తోందో చూడాలి.

Exit mobile version